మార్పు దిశగా ఉన్నత విద్య

28 Oct, 2016 00:33 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై అధ్యయనానికి ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఉన్నత విద్యను అభ్యసించిన యువత.. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతు న్న నేపథ్యంలో విద్యారంగంలో మార్పులకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో కేరళలో పర్యటించి అక్కడి ఉన్నత విద్యపై అధ్యయనం చేయనుంది.
 
  ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్, మరో ఇద్దరు ప్రొఫెసర్లతో కూడిన అధికారుల బృం దం.. నవంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు కేరళలో పర్యటించే అవకాశం ఉంది. మరోవైపు కొత్తగూడెంలో ఏర్పాటు చే యనున్న మైనింగ్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయి వర్సిటీగా అభివృద్ధి చేసేందుకు మండలి సిద్ధమవుతోంది.
 

మరిన్ని వార్తలు