మరింత ఉధృతంగా ఉద్యమాలు

23 Jan, 2017 03:41 IST|Sakshi
మరింత ఉధృతంగా ఉద్యమాలు

సామాజిక న్యాయ నినాదంతో ముందుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 90శాతం వరకు న్న ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనారిటీలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై క్షేత్రస్థాయి ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఎం నిర్ణయించింది. ప్రస్తుత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధా నాలకు ప్రత్యామ్నాయంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో బడుగు, బల హీనవర్గాలకు అభివృద్ధిలో తగిన వాటా లభించేలా తమ విధానాలను ప్రజల ముం దుంచాలని ఆ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ వర్గాలకు మేలు చేసే ప్రత్యా మ్నాయ ఆర్థిక ప్రణాళిక ముసాయిదాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. విశాల ప్రాతిపదికన వచ్చే సాధారణ ఎన్నికల నాటికి వామపక్షాలు, ప్రగతిశీల శక్తులు, సామాజిక శక్తులు, మేధావులతో కలసి ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా పార్టీ నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర దోహ దపడుతుందనే ఆశాభావంతో ఉంది.

24కు పాదయాత్రకు వందరోజులు
ప్రస్తుతం సీపీఎం ఆధ్వర్యంలో‘ ‘సామాజిక న్యాయంృరాష్ట్ర సమగ్రాభివృద్ధి’ నినాదంతో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు అను గుణంగా ఆయా ఉద్యమాలను తీవ్రతరం చేయనుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పార్టీలో వివిధ కార్యరంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 మంది నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ఈ నెల 24తో వందరోజులకు చేరనుంది. ఈ సంద ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్‌ సమావే శాలు, ర్యాలీలను నిర్వహించాలని సీపీఎం నాయకత్వం నిర్ణయించింది.

మార్చి 19న భారీ బహిరంగసభ...
పాదయాత్ర ముగింపు సందర్భంగా మార్చి 19న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించడం ద్వారా సత్తా చాటాలని సీపీఎం భావిస్తోంది. వచ్చే రెండు నెలల పాటు ఉధృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టి ముగింపుSసభకు భారీగా జనస మీకరణ æజరపాలని నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు