ఆన్‌లైన్‌లో అందాలను వర్ణిస్తూ..

28 Sep, 2016 10:21 IST|Sakshi
ఆన్‌లైన్‌లో అందాలను వర్ణిస్తూ..

సాక్షి, సిటీబ్యూరో: టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యభిచార దందా ముఠాలు హైటెక్‌ వ్యభిచారం మొదలుపెట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిల ఫొటోలను ఆయా వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసి, వారి శరీరాకృతిని వర్ణిస్తూ పూర్తి వివరాలు నిక్షిప్తం చేయడంతో పాటు కాంటాక్ట్‌ నంబర్లు ఇస్తూ నిర్వాహకులు బిజినెస్‌ చేస్తున్నారు. ఈజీ పద్ధతిన డబ్బు సంపాదించే మార్గం కావడంతో నగరానికి చెందిన కొందరు నిర్వాహకులు ఆన్‌లైన్‌ వ్యభిచార దందాను భారీ స్థాయిలో ప్రారంభించారు.

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ఉప్పల్‌ ఠాణా పరిధిలో ముగ్గురు నగరవాసులతో కూడిన ఓ వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు.

ఇద్దరు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. తాజాగా మంగళవారం న్యూఢిల్లీకి చెందిన నిర్వాహకురాలిని రామంతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు బాధిత మహిళలను వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. నిందితుల వద్ద 11 సెల్‌ఫోన్లు, ఒక కారు. రూ.32 వేలు స్వాధీనం చేసుకున్నారు.

లొకంటో.కామ్‌ వేదికగా..
న్యూఢిల్లీకి చెందిన ప్రచిశర్మ, కాజల్‌శర్మలు లొకంటో.కామ్‌లో అందమైన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ ఈ దందా చేశారు. వీరు తమ బాయ్‌ఫ్రెండ్‌ ఢిల్లీకే చెందిన జావేద్‌ అన్సారీ సహాకారంతో నగరంలోనూ వ్యభిచార దందా ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి తనకున్న పరిచయాలతో ప్రాచీ శర్మ కాల్ గరల్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి వివిధ హోటళ్లలో వసతి కల్పించి దందా చేసేది. గంటలను బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది.

ఇందులో 50 శాతం నగదు ఆమె తీసుకొని, హోటల్‌ ఖర్చులు మినహాయించి మిగతావి కాల్ గరల్స్‌కు కాల్ గరల్స్‌కు ఇచ్చేది. ఇదే విధంగా నగరానికి చెందిన రంజిత్, నగేశ్, రవివర్మ సహాకారంతో మెహిదీపట్నంలోని రేతిబౌలికి చెందిన డి.ప్రభాకర్‌ హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు రామాంతాపూర్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే ఢిల్లీకి చెందిన ప్రచిశర్మను మంగళవారం అరెస్టు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు.

మరిన్ని వార్తలు