రౌడీషీటర్లపై ఉక్కుపాదం

16 Nov, 2023 13:39 IST|Sakshi

బంజారాహిల్స్‌: పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. 

గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, బీసీ పెట్రోలింగ్‌ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్‌ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు.  

ఖైరతాబాద్‌ అసెంబ్లీ పరిధిలో...
ఖైరతాబాద్‌ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్‌గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్‌ ట్యాంక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్‌ పూర్తి చేశారు.  

జూబ్లీహిల్స్‌ పరిధిలో..
జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్‌నగర్, హుమాయన్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్‌ అధికారి, జూబ్లీహిల్స్‌ ఏసీపీ కట్టా హరిప్రసాద్‌ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు