హెరిటేజ్‌లో భారీ అగ్నిప్రమాదం

15 Mar, 2017 16:16 IST|Sakshi
హైదరాబాద్‌: ఉప్పల్‌లోని హెరిటేజ్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. 
మరిన్ని వార్తలు