జీఎస్‌టీతో అందరికీ లబ్ధి: ఈటల

15 Aug, 2016 02:14 IST|Sakshi
జీఎస్‌టీతో అందరికీ లబ్ధి: ఈటల

హైదరాబాద్: ప్రతిఒక్కరూ లబ్ధి పొందే విధంగా జీఎస్‌టీ పన్నుల విధానం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైటెక్స్‌లో నిర్వహిస్తున్న హైదరాబాద్ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో నగరం అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. నిర్మాణ సంస్థలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని సూచించారు. తెలంగాణలో ఒక శాతం వ్యాట్, నాలుగు శాతం సర్వీస్ ట్యాక్స్ కలిపి ఐదు శాతం పన్నులుండగా ఇతర రాష్ట్రాల్లో 12 శాతం చెల్లిస్తున్నట్లు తెలిపారు.

నిర్మాణరంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి హామీనిచ్చారు. క్రెడాయ్ ప్యానల్ చర్చల్లో భాగంగా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఈటల సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు రాంరెడ్డి, విశాఖ ఇండస్ట్రీస్ ఎం.డి. వివేక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు