ఎస్సై ప్రిలిమినరీలో బీటెక్‌ల హవా..

4 Jun, 2016 03:41 IST|Sakshi
ఎస్సై ప్రిలిమినరీలో బీటెక్‌ల హవా..

సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అత్యధికంగా ఇంగ్లిషు, సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టున్న వారే ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లోని 539 ఎస్సై పోస్టుల భర్తీ కోసం దాదాపు 1,87,255 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఏప్రిల్ 17న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించగా 88,875 మంది అర్హత సాధించారు. అయితే వీరిలో బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వంటి సాంకేతిక విద్య అభ్యసించిన వారే అత్యధికంగా అర్హత సాధించారు.

బీటెక్ చేసిన 38,476 మంది దరఖాస్తు చేసుకోగా, 61.14 శాతంతో 23,526 మంది అర్హత సాధించారు. అలాగే ఎంటెక్ చదివిన 3,263 మంది దరఖాస్తు చేసుకోగా, 71.55 శాతంతో 2,335 మంది అర్హత సాధించారు. ఎంసీఏ చేసిన అభ్యర్థులు 2,982 మంది దరఖాస్తు చేసుకోగా, 77.86 శాతంతో 2,322 మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బీకాం అభ్యర్థుల విషయానికొస్తే 29,772 మంది దరఖాస్తు చేసుకోగా, 36.74 శాతంతో 10,940 మంది అర్హత సాధించారు. బీఏ అభ్యర్థుల విషయంలో కూడా 21,619 మంది దరఖాస్తు చేసుకోగా, 40.08 శాతంతో 8,665 మంది అర్హత సాధించారు.

మరిన్ని వార్తలు