‘సాక్షి’ న్యూస్‌ రీడర్‌కు పురస్కారం

12 Jan, 2017 00:26 IST|Sakshi
‘సాక్షి’ న్యూస్‌ రీడర్‌కు పురస్కారం

వివేక్‌నగర్‌: వార్తల సేకరణ, వాటిని చదవటం కష్టమైన పని అని, న్యూస్‌రీడర్స్‌కు స్పష్టమైన ఉచ్చారణ, సమయస్ఫూర్తి ముఖ్యమని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. ఆరాధన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీత్యాగరాయ గానసభలో జరిగిన టీవీ న్యూస్‌ రీడర్స్‌ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిం చారు.  ఈ సందర్భంగా సాక్షి టీవీ న్యూస్‌ రీడర్‌ సిద్ధేశ్వరరెడ్డిని ఉత్తమ న్యూస్‌ రీడర్‌ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

ఇదే వేదికపై వివిధ తెలుగు టీవీ చానళ్లకు చెందిన టీవీ న్యూస్‌ రీడర్లకు ఉత్తమ న్యూస్‌ రీడర్స్‌ పురస్కారం ప్రదానం చేశారు. సీనియర్‌ న్యూస్‌ రీడర్స్‌ దీప్తి వాజ్‌పేయి, నాగశ్రీలను స్వర్ణ ప తకాలతో సత్కరించారు. సభలో సాహితీవేత్త డా. ద్వా.నా శాస్త్రి,గుదిబండి వెంకటరెడ్డి, వైకే నాగేశ్వరరావు, న్యూస్‌ రీడర్‌ కోట విజయలక్ష్మి, జి.హనుమంతరావు, జయప్రకాష్‌రెడ్డి, అ వార్డు గ్రహీతలు ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు  జరిగిన సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.

 

మరిన్ని వార్తలు