వర్షాలతో అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

13 Jun, 2015 18:11 IST|Sakshi

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ‘మాన్‌సూన్’ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీరు నిండి కాలువలు పొంగి పొర్లినా.. ఇళ్లల్లోకి నీళ్లు చేరినా.. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి రక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులను నియమించారు. ఆయా ప్రాంతాల వారీగా ఒక్కో అధికారిని ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి నవంబరు 2వ తేదీ వరకు ఆయా ప్రాంతాల వారీగా అధికారుల వివరాలను శనివారం ఉపకమిషనర్ మమత వెల్లడించారు. రెండు షిప్ట్‌ల వారీగా వీరు పనిచేస్తారని తెలిపారు. అత్యవసర కంట్రోల్ రూంను సైతం 24/7 పని చేసే విధంగా 040-23085845 ను కేటాయించారు. ఇక్కడ ఓ సిబ్బందిని నియమించి ఫోన్‌కు వచ్చే కాల్స్ ఆధారంగా అధికారులు అప్రమత్తమై సహాయక చర్యల్లో పాల్గొంటారని మమత తెలిపారు.

మరిన్ని వార్తలు