20వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ బ్యాచ్‌లు

14 Jun, 2016 02:54 IST|Sakshi
20వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ బ్యాచ్‌లు

సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో 30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం

 సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్‌లు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 30 రోజుల పాటు సాగే ఈ కోర్సులో ఆంగ్లంలో సాధారణంగా దొర్లే త ప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛరణ తదితర  అంశాలను క్షుణ్నంగా నేర్పిస్తారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తరగతులు ఉంటాయి.

కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600 నంబర్లలోగాని, sakshiedge@gmail.com మెయిల్ ద్వారాగానీ.. సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్ చిరునామాలోగాని సంప్రదించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

మరిన్ని వార్తలు