సానియాకు సమన్లు

9 Feb, 2017 09:44 IST|Sakshi
సానియాకు సమన్లు
  • జారీ చేసిన సర్వీస్‌ట్యాక్స్‌ అధికారులు
  • ‘బ్రాండ్‌’పారితోషికంపై సేవ పన్ను బకాయి
  • ఈ నెల 16న హాజరుకావాలని ఆదేశం
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చుట్టూ సర్వీస్‌ ట్యాక్స్‌ ఉచ్చు బిగుసుకుంటోంది. బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో తీసుకుంటున్న పారి తోషికానికి సేవా పన్ను చెల్లించాల్సిందేనని సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. సానియా మీర్జా ఏటా రూ.కోటి పారితోషికం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని గతంలో ప్రభుత్వమే ప్రకటించింది.

    ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్‌ ట్యాక్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో ఆ పారితోషికం మొత్తంపై ఏటా 15 శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాలు నెరపిన సర్వీస్‌ట్యాక్స్‌ అధికారులు మంగళవారం సానియాకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 16న వ్యక్తిగతంగా కానీ, అధికారిక ప్రతినిధి పంపడం ద్వారా కానీ సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ హైదరాబాద్‌ కమిషనరేట్‌లో హాజరుకావాలని స్పష్టం చేశారు. విచారణకు హాజరుకాని పక్షంలో చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు