అమెరికా కోటీశ్వరుడు సింఘంకు ఈడీ సమన్లు

17 Nov, 2023 06:08 IST|Sakshi

న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌పై నమోదైన మనీల్యాండరింగ్‌ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అమెరికన్‌ బిలియనీర్‌ నెవిల్లె రాయ్‌ సింఘంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్‌లో చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్‌క్లిక్‌కు డ్రాగన్‌ దేశం నుంచి నిధులు అందుతున్నట్లు గతంలో న్యూయార్క్‌టైమ్స్, తదితర పత్రికల్లో కథనాలు వచ్చాయి.

నెవిల్లె రాయ్‌ సింఘం, ఆయనకు చెందిన న్యూస్‌క్లిక్‌ను అత్యంత ప్రమా దకరమైనవని పేర్కొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఈడీ..న్యూస్‌క్లిక్‌ ఫౌండర్, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ పురకాయస్థకు చెందిన ఢిల్లీలోని రూ.4.52 కోట్లు విలువ చేసే భవనాన్ని, రూ.41 లక్షల బ్యాంకు డిపాజిట్లను అటాచ్‌ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సింఘం ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారు. దీంతో, ఆయ నకు విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు పంపింది. కాగా, ఈడీ ఆరోపణలను సింఘం ఖండించారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ మొదటిసారిగా 2021లో సింఘంకు నోటీసు పంపింది.

మరిన్ని వార్తలు