తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు

6 May, 2016 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎండవేడిమికి తాళలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వరుసగా మూడో రోజూ కాస్త ఉపశమనం లభించింది. చెదురుముదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. విదర్భ నుంచి తెలంగాణ, ఏపీల మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా గురువారం కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 6 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి.

అత్యధికంగా భద్రాచలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 41.5, రామగుండంలో 41.6, హన్మకొండలో 40.8, ఆదిలాబాద్‌లో 40.8, నల్లగొండలో 40.9 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో గరిష్టంగా 36.2 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి కారణంగా మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు