బయో టెర్రరిజం, అంటువ్యాధులపై యుద్ధం

28 Feb, 2017 00:54 IST|Sakshi
బయో టెర్రరిజం, అంటువ్యాధులపై యుద్ధం

ప్రజారోగ్య బిల్లు–2017 ముసాయిదా తయారు
1897 నాటి అంటువ్యాధుల చట్టం స్థానే కొత్తది
రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ కేంద్రం లేఖ


సాక్షి, హైదరాబాద్‌: బయో టెర్రరిజం, ప్రమాదకరమైన అంటువ్యాధులపై యుద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం 1897 నాటి అంటు వ్యాధుల చట్టాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయిం చింది. దానిస్థానే ప్రజారోగ్య (అంటు వ్యా ధులు, బయో టెర్రరిజం, విపత్తు నిర్మూ లన, నియంత్రణ, నిర్వహణ)బిల్లు–2017కు రూప కల్పన చేసింది. బిల్లు ముసాయిదాను రాష్ట్రా లకు పంపించింది. దీనిపై అభిప్రాయా లు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసింది. దాదాపు 120 ఏళ్ల క్రితం ఏర్పాటైన అంటువ్యాధుల చట్టం– 1897 ప్రస్తుత పరి స్థితులకు అనుగుణంగా లేదు. బయో టెర్ర రిజం ద్వారా వ్యాధుల వ్యాప్తి అంశాలు పాత చట్టంలో లేవు. ఇన్నేళ్లలో అనేక అంటువ్యా ధులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని నిర్మూలించడం, నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు.

ప్రమాదకరంగా బయో టెర్రరిజం..
నేరుగా యుద్ధం చేయకుండా జంతువులు, మనుషులు, ఇతరత్రా పద్ధతుల్లో వైరస్‌ను ప్రజల్లో వ్యాపింపజేయడం ద్వారా నష్టం చేకూర్చేందుకు ఉగ్రవాదులు, శత్రు దేశాలు ప్రయత్నిస్తుంటాయి. తద్వారా దేశంలో పెద్ద ఎత్తున జన సమూహం అనారోగ్యంతో చని పోయే పరిస్థితులు తలెత్తుతుంటాయి. బయో టెర్రరిస్టు ఏజెంట్లు ఆంత్రాక్స్, ట్రెంచ్‌ ఫీవర్, గ్లాండర్స్, క్యూ ఫీవర్, ప్లేగ్, కలరా తదితర బ్యాక్టీరియాలను ప్రజల్లోకి పంపుతారు. ఎబోలా, లస్సా ఫీవర్, ఎల్లో ఫీవర్, డెంగీ వంటి వైరస్‌లనూ సమాజంలోకి వదిలే అవ కాశం ఉంది. ఇలా దాదాపు 36 రకాల బ్యాక్టీ రియాలు, వైరస్‌లు, ఫంగీ, టాక్సిన్స్‌లను బయో టెర్రరిజంలో ఉపయోగించేవిగా గుర్తించారు. ఆంత్రాక్స్‌ను పోస్టల్‌ కార్డుల ద్వారానూ.. కరపత్రాల ద్వారానూ వ్యాపిం పజేసే ప్రమాదమూ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వివిధ దేశాలు ఇలాంటి బయో టెర్రరిజాన్ని వాడుకుంటున్నాయి.

ఉగ్ర వాదులూ దీన్నో సాధనంగా ఉపయోగించు కుంటున్నారు. 1984లో అమెరికాలోని డల్లాస్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకుండా రెస్టారెంట్లు, స్టోర్లు తదితర చోట్ల సాల్మొనిల్లా టైఫీమురియం అనే బ్యాక్టీరియాను కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు వ్యాపింపజేశాయి. దీంతో 750 మంది ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంత్రాక్స్‌ను జంతువులపై ప్రయోగించారు. 1972లో ఇద్దరు అమెరికా విద్యార్థులు షికాగోలోని ప్రజా నీటి సరఫరా ట్యాంకుల్లో టైఫాయిడ్‌ బ్యాక్టీరియాను వ్యాపింపజేశారు. 1993లో టోక్యోలో ఒక మత సంస్థ ఆంత్రాక్స్‌ బ్యాక్టీరి యాను వ్యాపింపజేసింది. ఇలా బయో టెర్రరి జానికి సంబంధించి వందల ఉదాహరణ లున్నాయి. ఇటువంటి వాటికి దేశంలో చెక్‌ పెట్టాలనేదే కొత్త చట్టం ఉద్దేశం.

ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో రాష్ట్రాల్లోకి కేంద్ర బలగాలు..
ఆరోగ్య రంగం రాష్ట్రాలకు సంబం ధించిన అంశం. అయితే బయో టెర్రరిజం, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని నివారించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర బలగాలు రాష్ట్రాల్లోకి నేరుగా ప్రవేశించేందుకు నూతన చట్టం వీలు కల్పిస్తుంది. ఎవరి మీదనైనా.. సంస్థలపైనా అనుమానం ఉంటే ఎటువంటి హెచ్చరికలు లేకుండా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలాగే బయో టెర్రరిజం కుట్రలో భాగంగా వైరస్, బ్యాక్టీరియా ఉన్న వ్యక్తి తాను వైద్యం చేయించుకోనంటే కుదరదు. వారిని బలవంతంగా పట్టుకొచ్చి చికిత్స చేయిస్తారు. మానవ హక్కుల పేరుతో ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కాగా, ఈ బిల్లును తాము స్వాగతిస్తున్నా మని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు