జయలలిత కూతురు ఈమేనంటూ...

12 Dec, 2016 13:53 IST|Sakshi
జయలలిత కూతురు ఈమేనంటూ...
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఒక మహిళ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ ఆమె ఫొటోను గ్రూపులలో తెగ షేర్ చేశారు. కానీ అసలు ఆమెకు, జయలలితకు ఏమాత్రం సంబంధం లేదని తేలిపోయింది. ఆమె ఎవరన్న విషయం ఇన్నాళ్ల పాటు తెలియకపోయినా.. ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి పుణ్యమాని అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఇదే ఫొటో 2014 నుంచే ఇలా తిరుగుతోంది. అప్పట్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తొలిసారి ఈ ఫొటో బయటకు వచ్చింది. కాస్త సెన్సిబుల్‌గా ఆలోచించేవాళ్లకు ఇలాంటి ఫొటోలు చూస్తే ఎక్కడలేని చికాకు వస్తుంది. కానీ కొంతమంది మాత్రం వీటిని నిజంగానే నమ్మేస్తారు కూడా.