జిబ్రాల్టర్‌లో విడుదలైన నలుగురు భారతీయులు

16 Aug, 2019 03:36 IST|Sakshi

లండన్‌: ఇరాన్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌లో ఉండి అరెస్టయిన కెప్టెన్‌ సహా నలుగురు భారత సిబ్బందిపై పోలీసుల విచారణ ముగిసి వారు జిబ్రాల్టర్‌లో గురువారం విడుదలయ్యారు. స్పెయిన్‌కు దక్షిణాన, సముద్ర తీరంలో ఉండే బ్రిటిష్‌ ప్రాంతమే ఈ జిబ్రాల్టర్‌. పనామా జెండా కలిగిన ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ జిబ్రాల్టర్‌ జలాల్లోని ఐరోపా పాయింట్‌ వద్ద ఉండగా, గత నెల 4వ తేదీన జిబ్రాల్టర్‌ అధికారులు వారిని అడ్డగించి ట్యాంకర్‌ను తమ అధీనంలోకి తీసుకుని అందులోని 28 మంది సిబ్బందిని అరెస్టు చేశారు.

సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయులే. సిరియాపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఆంక్షలున్నాయి. ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ ద్వారా సిరియాకు ముడి చమురును తీసుకెళ్తున్నారనే అనుమానంతో జిబ్రాల్టర్‌ అధికారులు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే అది సిరియాకు వెళ్తున్నది కాదని అప్పటి నుంచి ఇరాన్‌ ప్రభుత్వం, ట్యాంకర్‌ సిబ్బంది చెబుతూనే ఉన్నారు. దీంతో తాజాగా నలుగురు భారతీయులపై పోలీసులు విచారణ ముగించి, వారిని జిబ్రాల్టర్‌లో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు