కవాతులో కుప్పకూలిన ఆ గజరాజు మృతి

25 Sep, 2019 15:21 IST|Sakshi

కొలంబో : శ్రీలంకలోని ఓ ఉత్సవాలలో జరిగిన కవాతులో ఉపయోగించిన వృద్ధ ఏనుగు మంగళవారం రాత్రి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వన్యప్రాణిశాఖ అధికారి తెలిపారు. ‘టెంపుల్ ఆఫ్ ది టూత్’.. పవిత్రమైన బౌద్ధమత పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా సాంప్రదాయ నృత్యాలతో పాటు దాదాపు 100 ఏనుగులతో వార్షిక పండుగను నిర్వహిస్తారు. ఎప్పటిలాగే నిర్వహించిన పెరెహర ఉత్సవాల్లో 70 ఏళ్ల వృద్ధ ఏనుగు టికిరిని పోటీల్లో నిలిపారు. అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవాతులో వృద్ధ ఏనుగును భారీ దుస్తులతో కప్పి దాని బలహీనతలను బయటికి కనిపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

అయిన్పటికీ పోటీ మధ్యలోనే అది కుప్పకూలిపోవడంతో.. బలహీనమైన ఏనుగును కవాతులో ఉపయోగించడంపై గత నెలలో అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చివరి పోటీల నుంచి ఈ ఏనుగును తప్పించారు. అయితే అప్పటి నుంచి భారంగా బతుకునీడుస్తున్న ఈ వృద్ధ ఏనుగు తాజాగా ప్రాణాలు విడిచింది. ఏనుగుల నిపుణుడు జయంతా జయవర్ధనే మాట్లాడుతూ.. వృద్ధ ఏనుగు ఉత్సవాలలో  పాల్గొన్న నాటి నుంచి పోషకాహార లోపంతో బాధపడుతుందని.. అయినప్పటికీ ఇన్ని రోజులు జీవించి ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.

చదవండి : అయ్యో! ఎంత అమానుషం

మరిన్ని వార్తలు