పదికోట్లిచ్చిన ఎమ్మా వాట్సన్‌

23 Feb, 2018 18:13 IST|Sakshi
ప్రముఖ బ్రిటన్‌ నటి, ఫెమినిస్ట్‌ ఎమ్మా వాట్సన్‌

లండన్‌: బ్రిటన్‌లో స్త్రీ, పురుషుల సమాన హక్కుల కోసం, మహిళా సాధికారిత కోసం ‘టైమీస్‌ అప్‌’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ బ్రిటన్‌ నటి, ఫెమినిస్ట్‌ ఎమ్మా వాట్సన్‌ ‘బ్రిటన్‌ జస్టిస్‌ అండ్‌ ఈక్వాలిటీ ఫండ్‌’కు పది కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఇటు లండన్, అటు న్యూయార్క్‌ సబ్‌వేలలో ఫెమినిస్టు పుస్తకాలను ఉద్దేశపూర్వకంగా వదిలేసి రావడం వల్ల తొలుత వార్తల్లోకి ఎక్కిన ఆమె ఆ తర్వాత ‘టైమీస్‌ అప్‌’ ఉద్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫెమినిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు.

‘మహిళల సాధికారిత కోసం, పనిచేసే చోట స్త్రీ, పురుషులను సమానంగా చూసే సమ న్యాయం కోసం  కొనసాగిస్తున్న ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం కావాలి. మహిళలు–మహిళలతో, మహిళలు, పురుషులతో భుజంభుజం కలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించాలి. ముఖ్యంగా సమానత్వ నిధికి విరాళాలు విరివిగా అందించాలి’ అని పిలుపుతో కూడిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు