మణికర్ణికలో కంగనా లుక్‌..

23 Feb, 2018 18:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కంగనా రనౌత్‌ ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీపై అంచనాలు మిన్నంటాయి.  దక్షిణాది సినీ విశ్లేషకులు రమేష్‌ బాల కంగనా మణికర్ణిక సెట్స్‌లో ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో అవి వైరల్‌ అవుతున్నాయి. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా ఆమె హుందాగా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయారు.

పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కధ సమకూర్చగా, క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీవీ నటి అంకితా లోఖండే తొలిసారిగా ఈ మూవీ ద్వారా బిగ్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా వీరిద్దరూ గుర్రపు స్వారీలో శిక్షణ పొందారు. 

మరిన్ని వార్తలు