భీకర తుపాన్.. 50 మందికి పైగా మృతి

7 Oct, 2016 07:33 IST|Sakshi
భీకర తుపాన్.. 50 మందికి పైగా మృతి

పోర్ట్ ఆ ప్రిన్స్: కరీబియన్ దీవులపై హరికేన్ విరుచుకుపడింది. దీంతో 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కరీబియన్ దీవులలోని హైతీ తీరంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. హైతీ మాథ్యూ అని పిలువబడే భీకరమైన తుపాన్ హైతీ దక్షిణాన ఉన్న రోచ్ ఎ బటియు నగరాన్ని తాకింది.

ఈ నగరం మొత్తం తీరప్రాంతం కావడంతో తుపాన్ దాటికి జనం విలవిల్లాడిపోయారు. ఈ హైతీ తుపాన్ కారణంగా గత రెండు రోజులుగా 23గా ఉన్న మృతుల సంఖ్య 50కి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశాలున్నాయని తెలిపారు. లెస్ కాయెస్ నుంచి టిబురాన్, పెర్రె లూయిస ఆస్టిన్ నగరాలు హరికేన్స్ వల్ల తీవ్రంగా నష్టపోయాయి.

మరిన్ని వార్తలు