వివేక్ రామస్వామి సర్ఫింగ్‌ వీడియో వైరల్‌: నీళ్లలోకి తోసేసి మరీ..!

15 Nov, 2023 14:56 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి  సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.  దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.

 డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్‌  రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో  చూడొచ్చు.

మొత్తానికి  నేర్పుగా  నేర్చుకుని  నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్‌ చేశారు. అంతేకాదు నాట్‌నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్‌ చేయాలన్న సాయల్‌  సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి  అలవోకగా వేక్‌ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం.  ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అని కొందరు,  మేన్‌ ఆఫ్‌ యంగ్‌ పీపుల్‌ మరికొందరు కమెంట్‌ చేయగా, ఇంకొందరు నెగిటివ్‌ కమెంట్స్‌  కూడా చేశారు. 

 కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న  సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి  వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో   భాగంగా  వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై  విరుచుకుపడ్డారు వివేక్‌. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య  వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి

A post shared by Kaz (@kazsawyer)

మరిన్ని వార్తలు