బంగ్లా ప్రధానిపై బాంబు దాడి: తృటిలో తప్పిన ప్రమాదం

7 Mar, 2015 23:42 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై శనివారం బాంబు దాడి జరిగింది. ఆ బాంబు దాడి నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఢాకాలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ ద్వారా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాత అక్కడ బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971 లో చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని పురస్కరించుకుని అధికార పార్టీ అవామీ లీగ్ ఏర్పాటు చేసిన ర్యాలీకి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి.

 

గత జనవరి 5 వ తేదీన ఆమె ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ, దాని మిత్రపక్షాలు నిరసన బాటపట్టిన సంగతి తెలిసిందే.అప్పట్నుంచి బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. గత రెండు నెలల నుంచి బంగ్లాలో జరిగిన బాంబు దాడుల్లో 100 వరకూ అసువులు బాసారు.

మరిన్ని వార్తలు