రొమ్ము పాలతో బ్రెస్ట్‌ కేన్సర్‌ గుర్తింపు

24 Apr, 2017 02:03 IST|Sakshi
రొమ్ము పాలతో బ్రెస్ట్‌ కేన్సర్‌ గుర్తింపు

బోస్టన్‌: రొమ్ము పాలలోని ప్రొటీన్‌ల తీరును బట్టి బ్రెస్ట్‌ కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చని తేలింది.  యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను గుర్తించడంలో ఇప్పుడున్న మామోగ్రఫీ, ఇమేజింగ్‌ పద్ధతులు అంత ప్రభావవంతమైనవి కావని, యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కణజాలాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

రొమ్ము పాలు, కన్నీళ్లు, మూత్రం, లాలాజలం, సీరం వంటి ద్రవాల్లోని ప్రొటీన్‌ల తీరులను పర్యవేక్షించడం ద్వారా బ్రెస్ట్‌ కేన్సర్‌ను గుర్తించవచ్చని మసాచూసెట్స్‌ వర్సిటీ పరిశోధకులు వివరించారు. పరిశోధనలో భాగంగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న మహిళలు, రొమ్ము కేన్సర్‌ లేని మహిళల పాలను పోల్చి చూశారు.  రొమ్ము కేన్సర్‌ వ్యాధికి కారణంగా భావించే ఎపిథియల్‌ కణాలను పరీక్షించేందుకు రొమ్ము పాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు