లేత వయసులో ఘాటు ప్రేమ!

12 Dec, 2016 14:53 IST|Sakshi
లేత వయసులో ఘాటు ప్రేమ!

బ్రిటన్‌కు చెందిన ముద్దులొలికే మిల్లీ వయసు ఆరేడేళ్లు ఉంటుంది. మొన్నొక రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఒక రింగ్‌ చూపించింది. స్కూల్లో తనతో పాటు చదువుకుంటున్న టామీ తనకు ప్రపోజ్‌చేశాడని చెప్పింది. అది ఏదో సాదా సీదా ఉంగరం కాదు. మూడు పెద్ద వజ్రాలు పొదిగిన నిజమైన ఎంగేజ్‌మెంట్‌రింగ్. ఈ విషయాన్ని చెప్తూ మిల్లీ తండ్రి ఈ నెల 16న ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన వీడియో ఇప్పుడు ప్రపంచమంతా వైరల్‌ అవుతోంది. మిల్లీ ముసిముసిగా నవ్వుతూ టామీ పేరు చెప్పడం, అతడు ఇచ్చిన రింగ్‌ను ఆ తండ్రి చూపిస్తూ వివరించడం, తెర వెనుక మిల్లీ తల్లి విరగబడి నవ్వుతుండటం ఈ వీడియోను హాట్‌టాపిక్‌గా మార్చేసింది. టామీ తన తల్లి ఎంగేజ్‌మెంట్‌రింగ్‌ను తస్కరించి తెచ్చివుంటాడన్న మిల్లీ తండ్రి.. టామీని ‘గో అహెడ్‌’ అంటూ ప్రోత్సహించటం కొసమెరుపు!