డాన్సర్ దుస్తులపై వివాదం

2 Jun, 2016 08:44 IST|Sakshi
డాన్సర్ దుస్తులపై వివాదం

బోస్టన్: డాన్సర్ మ్యాగీ మెక్ మఫ్ఫీన్ కు నెటిజన్లు అండగా నిలిచారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో ఆమెకు జరిగిన అవమానంపై సోషల్ మీడియాలో గళమెత్తారు. కురచ దుస్తులు వేసుకుందన్న కారణంగా జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ ఆమెను విమానంలోని ఎక్కనీయయలేదు. అప్పటికప్పుడు పొడుగు దుస్తులు కొనుక్కుని వేసుకోవడంతో ఆమెను విమానంలోకి అనుమతించారు.

మఫ్ఫీన్ పట్ల జెట్ బ్లూ ఎయిర్లైన్స్ సిబ్బంది వివక్ష పూరితంగా వ్యవహరించారని నెటిజన్లు ఆరోపించారు. బూటీ సాలిడారిటీ, బూటీ షార్ట్ సపోర్ట్ హాష్ ట్యాగ్స్తో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఇది డ్రెస్ కోడ్ వివక్ష అని ఎద్దేవా చేశారు. మనిషి మనిషికి డ్రెస్ కోడ్ పెడతారా అని ప్రశ్నించారు.

తాను ఒంటినిండా దుస్తులు వేసుకున్నానని, నియమాలు ఉల్లంఘించలేదని మఫ్ఫీన్ తెలిపింది. అయితే ప్రయాణికుల దుస్తులు అభ్యంతకరంగా ఉంటే అనుమతించబోమని జెట్ బ్లూ అధికార ప్రతినిధి అన్నారు. చివరకు మఫ్ఫీన్ కు జెట్ బ్లూ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా ఆమెకు 162 డాలర్ల ఫ్లైట్ క్రెడిట్ ఆఫర్ చేసింది. డ్రెస్ కోడ్ పై జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ స్పష్టత ఇవ్వాలని మప్ఫీన్ డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తలు