సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు

15 May, 2016 12:51 IST|Sakshi
సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు

సియోల్: ఒక్కోసారి ఎంతటి ప్రశాంతవాతవరణమైన రణరంగాన్ని తలపించొచ్చు. ఎంత శాంతంగా ఉన్న జీవైన భయంగుప్పిట్లోకి జారుకుందంటే తనకు తెలియకుండానే ప్రమాదబారిన పడటమో ప్రమాదంలో పడేయడమో చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు.

వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు.

ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు.
 

>
మరిన్ని వార్తలు