ఆరోగ్యానికి.. ‘చెక్ మీ’

28 Jun, 2015 03:12 IST|Sakshi
ఆరోగ్యానికి.. ‘చెక్ మీ’

ఆరోగ్యమే మహాభాగ్యం. నిజమే. కానీ ఈ అదృష్టం అందరికీ ఉండదు. ఏ కారణం చేతనైనా అనారోగ్యం పాలై... నిత్యం రక్త పరీక్షలతోపాటు బీపీ, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకోండి... ఆ పరిస్థితి ఊహించేందుకే ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే... అమెరికాలోని వయాటోమ్ కంపెనీ తయారు చేసిన ఈ ‘చెక్ మీ’ పరికరం మీ చేతిలో ఉంటే మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. బీపీ, షుగర్లను మాత్రమే కాదు, కావాల్సినప్పుడల్లా ఈసీజీ కూడా తీసిపెట్టగల హైటెక్ అద్భుతం ఈ పరికరం.

ఒకవైపు లోహపుపట్టీ, మరోవైపు ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ఉన్న ఈ పరికరం ద్వారా మొత్తం ఆరు కీలకమైన శరీర పరీక్షలు చేసుకోవచ్చు. ఒక అదనపు సెన్సర్‌ను బిగించుకోవడం ద్వారా మన నిద్ర తీరుతెన్నులెలా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. మందు లెప్పుడు వేసుకోవాలో గుర్తు చేసే అసిస్టెంట్ కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. అంతే కాకుం డా ఈ పరికరాన్ని జేబులో ఉంచుకుంటే చాలు... ఒక రోజు మొత్తమ్మీద మీరు ఎంత దూరం నడిచారు, ఫలితంగా ఎన్ని కేలరీల శక్తి ఖర్చయింది, వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు