-

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురు దెబ్బ

28 Nov, 2023 06:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అల్‌–ఖదీర్‌ ట్రస్టు అవినీతి కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. రహస్య పత్రాల లీకేజీ కేసులో రావలి్పండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) అల్‌–ఖదీర్‌ ట్రస్ట్‌ కేసులో ఈ నెల 14న అదుపులోకి తీసుకుంది.

రూ.2 వేల కోట్లు మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ కేసులో ఇమ్రాన్‌ను కస్టడీకివ్వాలన్న ఎన్‌ఏబీ వాదనను జడ్జి తోసిపుచ్చుతూ 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

మరిన్ని వార్తలు