ఉత్తర కొరియాను తప్పుబట్టిన చైనా, భారత్

6 Jan, 2016 18:22 IST|Sakshi
ఉత్తర కొరియాను తప్పుబట్టిన చైనా, భారత్

బీజింగ్: ఉత్తర కొరియా అణుపరీక్ష చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్య ఏమాత్రం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఈశాన్య ఆసియాలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి'ఒక్క దేశంపై ఉందని పేర్కొంది. 'అణుపరీక్షలకు దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర కొరియా కట్టుబడి ఉండాలి. ఈశాన్య ఆసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు అణుసంపదను దుర్వినియోగం చేసే చర్యలు మానుకోవాలి.

 

ఈ విషయం ప్రపంచంలోని ప్రజలందరికీ ఆందోళనకరమైనదే అనే అంశాన్ని ఉత్తర కొరియా గుర్తించాలి' అని చైనా విదేశాంగా అధికార ప్రతినిథి హువా చనియింగ్ పేర్కొన్నారు. భారత్ కూడా ఉత్తర కొరియా చర్యను ఖండించింది. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని భారత విదేశాంగ అధికారి ఒకరు అన్నారు. 

మరిన్ని వార్తలు