331కి పెరిగిన మృతుల సంఖ్య

6 Jun, 2015 09:55 IST|Sakshi
యాంగ్జీ నదిలో మునిగిపోయిన పర్యాటక నౌకను భారీ యంత్రాలతో వెలికి తీస్తున్న దృశ్యం

బీజింగ్: పెనుతుఫాన్ తాకిడికి చైనాలోని యాంగ్జీ నదిలో పర్యాటక నౌక మునిగిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 331కు పెరిగింది. జూన్ 1న సంభవించిన ఈ ప్రమాదంలో ఈస్టర్న్ స్టార్ అనే పర్యాటక నౌకలో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.

గల్లంతైన వారిలో కేవలం 14 మందిని మాత్రమే సహాయ బృందాలు కాపాడగలిగినట్లు, శనివారం నాటికి 331 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 149 మర బోట్లు, 59 భారీ యంత్రాలు, ఒక హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, ఇందులో 3,500 మంది సైనికులు, 1700 మంది పారామిలటరీ  పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు