అమెరికా: కరోనాతో వాటికి మంచి జరిగింది!

26 Apr, 2020 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్‌ : మనం చెడు అనుకున్నది ఇంకొకరికి మంచి అనిపించవచ్చు. కొందరికి నష్టం కలిగించేది.. మరికొందరికి లాభం చేకూర్చవచ్చు. కరోనా వైరస్‌ విషయంలో ఈ రెండు వాఖ్యాలు చెల్లుబాటవుతాయి. వైరస్‌ కారణంగా అమెరికా మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఒంటరిగా తమను పెంచుకునే వారు లేక ఇబ్బందిపడ్డ కొన్ని జంతువులు మాత్రం ఓ ఇంటివవుతున్నాయి. దేశంలోని జంతు సంరక్షణ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. వివరాలు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ఇంటికి పరిమితమైన చాలామంది సంరక్షణ కేంద్రాల్లోని జంతువులను దత్తత తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో అమెరికాలోని చాలా మటుకు జంతు సంరక్షణ కేంద్రాలు ఖాళీ అవటం మొదలుపెట్టాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, గెనిపిగ్స్‌, కోళ్లను దత్తత తీసుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అమెరికన్లు ఇష్టమైన జంతువుల్ని దత్తత తీసుకుని సంతోషపడుతున్నారు. ( థూ.. నువ్వసలు మనిషివేనా? : వైరల్‌ )

మరిన్ని వార్తలు