‘కరోనా విధులు’  తప్పించుకుంటే ఇక అంతే....

8 Feb, 2020 18:44 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలోని వుహాన్‌ పట్టణంలోని కరోనా వైరస్‌ రోగులందరిని గుర్తించి, వారితో పాటు వారి సన్నిహితులను కట్టుదిట్టమైన  ఏర్పాట్లు కలిగిన నిర్బంధిత వైద్య శిబిరాల్లో చేర్చాల్సిందిగా చైనా ఉప ప్రధాని సున్‌ చున్‌లాన్‌ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇది యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితి. ఈ సమయంలో విధుల నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదు. అలా ఎవరైనా ప్రయత్నించినట్లయితే వారిని గోడకు శిల వేస్తాం. చారిత్రకంగా మరిచిపోని విధంగా సిగ్గు తీస్తాం’ అని ఆమె హెచ్చరించారు. (కరోనా భయం: కూతురికి గాల్లోనే హగ్ ఇచ్చిన నర్సు..)

ఇప్పుటకే 1.40 కోట్ల మంది జనాభా కలిగిన వుహాన్‌ పట్టణంలో అధికారులు ఇల్లిల్లూ తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం కరోనా వైరస్‌ ఉన్నట్లు అనుమానం వచ్చినా నిర్బంధిత వైద్య శిబిరాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే పలు ఆస్పత్రులు నిండిపోవడంతో ఇంటింటి సర్వేలో మరెంత మంది రోగులు బయటపడతారో వారందరికి ఎక్కడికి తరలించాలో అర్థంకాని పరిస్థితుల్లో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లో ఖాళీ భవనాలను ఆస్పత్రులుగా మార్చినా, రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించినా పడకలు సరిపోవడం లేదు. (కరోనా : ఆకలితో చావాల్సి వస్తుంది, అందుకే ఇలా..!)

మరిన్ని వార్తలు