యూఎస్‌లో భారత సంతతి మహిళకు కీలక పదవి

1 Sep, 2019 11:07 IST|Sakshi

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ న్యాయవాది శిరీన్‌ మాథ్యూస్‌కు అమెరికాలో కీలక పదవి దక్కింది. ఆమెను ఫెడరల్‌ న్యాయవాదిగా నియమిస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. మాథ్యూస్‌ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా, క్రిమినల్ హెల్త్‌కేర్‌ కేసులకు సమన్వయకర్తగాను వ్యవహరించారు. ఫెడరల్‌ కోర్టులలో ఇదివరకే ఐదుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

సాబానార్త్ అమెరికా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కూడా మాథ్యూస్‌ తన సేవలను అందించారు. ఆమె నియామకాన్ని సెనెట్‌ ఆమోదించాల్సి ఉంది. వైద్య పరికరాలకు సంబంధించి  మిలియన్ డాలర్ల అవినీతిని బయటపెట్టిన ఘనచరిత్ర ఆమె సొంతం. పెన్షన్ల కోసం పోరాడినందుకు సామాజిక భద్రత అవార్డు సైతం లభించడం విశేషం.


 

మరిన్ని వార్తలు