రోసాలిన్‌ కార్టర్‌ కన్నుమూత

21 Nov, 2023 05:36 IST|Sakshi

అట్లాంటా(అమెరికా): మానసిక వైద్య సంస్కరణల కోసం అహరి్నశలు కృషిచేసిన మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య, మానవతావాది రోసాలిన్‌ కార్టర్‌ కన్నుమూశారు.

కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల రోసాలిన్‌ ఆదివారం జార్జియా రాష్ట్రంలోని ప్లేన్స్‌ నగరంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘నాకు అత్యవసరమైన ప్రతిసారీ సరైన సలహాలిచి్చంది. చక్కని మార్గదర్శిగా ఉంటూ జీవితాంతం తోడుగా నిలిచింది’ అని 99 ఏళ్ల భర్త జిమ్మీ కార్టర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు