భారతీయ అమెరికన్లకు గ్రేట్‌ ఇమ్మిగ్రంట్స్‌ అవార్డు

2 Jul, 2017 18:49 IST|Sakshi
భారతీయ అమెరికన్లకు గ్రేట్‌ ఇమ్మిగ్రంట్స్‌ అవార్డు

న్యూయార్క్‌: ఇద్దరు భారతీయ అమెరికన్లకు ఈ ఏడాదికిగాను గ్రేట్‌ ఇమ్మిగ్రంట్స్‌ అవార్డు వరించింది. అడోబ్‌ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది.

ఈ నెల 4న అవార్డును వారికి అందజేయనున్నారు. బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్‌ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్‌ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్‌ యూఎస్‌– ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా పని చేశారు.

మరిన్ని వార్తలు