అంతరిక్షంలో ఆవాసం..!

30 May, 2016 02:10 IST|Sakshi
అంతరిక్షంలో ఆవాసం..!

వాషింగ్టన్: నాసా మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)ను మరి కాస్త విస్తరించింది. రెండు రోజుల క్రితం ఇదే ప్రయత్నంలో విఫలమైన ‘నాసా’.. ఐఎస్‌ఎస్‌ను తాజాగా ఒక గది మేరకు విస్తరించగలిగింది. వ్యోమగామి జెఫ్ విలియమ్స్.. నెమ్మదిగా చిన్న చిన్న పేలుళ్ల ద్వారా పీడనం పెంచుతూ ఐఎస్‌ఎస్‌ను పూర్తిగా 67 అంగుళాల మేర విస్తరించగలిగారు.

అనంతరం ‘బిగ్‌లో ఎక్స్‌పాండబుల్ యాక్టివిటీ మోడ్యూల్ (బీమ్)’ అనే ఈ తొలి మార్పులు చేయగల ఆవాసం లోపల 8 ఎయిర్ ట్యాంక్‌లను వదిలారు. వ్యోమగాము లు ఉండేందుకు అవసరమైన ఒత్తిడి, ఇతర వాతావరణ పరిస్థితులు నెలకొల్పారు. మొత్తం ఈ ప్రయత్నానికి రూ. 113 కోట్లు ఖర్చయింది. ఈ బీమ్‌ను సంపూర్ణంగా విస్తరిస్తే 13 అడుగుల పొడవు, 10.5 అడుగుల వెడల్పు ఉన్న గదిలా మారుతుంది. బిగ్‌లో ఏరోస్పేస్ సంస్థ సహకారంతో నాసా ఈ ఘనత సాధించగలిగింది. చంద్రుడు, అంగారకుడి మీద నివాసయోగ్య గదులను ఏర్పాటు చేసేందుకు నాసా యత్నిస్తోంది.

మరిన్ని వార్తలు