ఆస్ట్రేలియన్లను అలరించనున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

24 Jun, 2016 22:24 IST|Sakshi

మెల్‌బోర్న్: భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, కళాకారుల నైపుణ్యాన్ని చాటడానికి  మొదటిసారిగా ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, కాన్‌బెర్రా తదితర ప్రధాన నగరాల్లో ఆగస్టులో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని భారత హైకమిషనర్ నవ్‌దీప్ సూరి వెల్లడించారు. నాలుగు నెలలపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు, సంగీతంతోపాటు భారతీయ కళలను ప్రదర్శిస్తారని చెప్పారు.

ఆస్ట్రేలియా, ఇండియా ప్రభుత్వాలతోపాటు పలు ప్రైవేటు సంస్థల సహాయంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రదర్శనలు ఉంటాయని, ఒడిషా నర్తకి సుజతా మహాపాత్ర, రఘు దీక్షిత్ సంగీతం, అజిత్ నియాన్ కార్టూన్ ఎగ్జిబిషన్, తోలుబొమ్మలాట వంటివి ఆస్ట్రేలియన్లను అలరిస్తాయని చెప్పారు. ఈ ఉత్సవం అధికారికంగా వచ్చే నెలలో సిడ్నీలో ప్రారంభమవనుంది.

మరిన్ని వార్తలు