జీసస్ కాపాడిన పట్టణం

26 Feb, 2016 09:10 IST|Sakshi
జీసస్ కాపాడిన పట్టణం

రైలు ముచ్చట్లు
 
అది మెక్సికోలోని నకోజారి పట్టణం. పెద్ద ఎత్తున డైనమేట్లు, పేలుడు పదార్థాలను మోసుకొస్తున్న గూడ్సు రైలు మార్గం మధ్యలో చెడిపోయి పట్టణం వైపు వస్తోంది. దీనికితోడు రైల్లో మంటలు. అందులోని డైనమేట్లు పేలితే పట్టణం నామరూపాల్లేకుండా పోతుంది. సరిగ్గా అదే సమయంలో వచ్చాడు జీసస్ గార్షియా.

రైల్వేలైన్  బ్రేకులను పర్యవేక్షించే ఈయన.. తగులబడిపోతున్న ఆ రైలును నడిపిస్తూ పట్టణానికి 6 కి.మీ. దూరం తీసుకెళాడు. అక్కడికి వెళ్లగానే రైలు పేలిపోయింది. ఆ మంటల్లో జీసస్ చనిపోయారు. కానీ నేటికీ అక్కడి వారి గుండెల్లో బతికే ఉన్నాడు. 1907లో ఈ సంఘటన జరిగింది.
 
కుక్క.. రైల్లో ఎంచక్కా!
మాస్కో శివారులోని శునకాలు ఎంత తెలివైనవో! ఏ రైలు ఏ టైంకు వస్తుంది? ఎక్కడికెళ్తుందన్నదీ వాటికి తెలుసు. శివార్ల నుంచి వచ్చే రైళ్లలో ఎక్కి ఎంచక్కా మాస్కో చేరుకుంటాయట.

గమ్యస్థానం రాగానే దిగి అక్కడ వీధుల్లో తిరిగి ఆ రోజుకు పొట్ట నింపుకొని సాయంత్రం మరో రైల్లో తిరిగి వచ్చేస్తాయట.

మరిన్ని వార్తలు