God Department: ‘గాడ్‌ డిపార్ట్‌మెంట్‌’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?

14 Nov, 2023 13:13 IST|Sakshi

ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్‌మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్‌మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. 

ఇజ్రాయెట్‌ 21సీ. ఓఆర్‌జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని  వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్.

ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోని ‘గాడ్ డిపార్ట్‌మెంట్‌’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్‌’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు.
ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!

మరిన్ని వార్తలు