ఆ గొడవల్లో పురుషులు, స్త్రీల స్పందనల్లో తేడా..

19 Dec, 2016 16:24 IST|Sakshi
ఆ గొడవల్లో పురుషులు, స్త్రీల స్పందనల్లో తేడా..

లండన్‌: ఉద్యోగ జీవితంలో బాస్‌తో, సహచరులతో గొడవలు పడే అలవాటు ఉందా. ఒకవేళ ఉంటే.. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వర్క్‌ ప్లేస్‌లో గొడవల విషయంలో మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల స్పందించే తీరు వేరు వేరుగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

వర్క్‌ ప్లేస్‌లో గొడవలు పడే పురుష ఉద్యోగులు ఆ ఉద్యోగాన్నే వదిలేయడానికి మొగ్గుచూపుతారని.. అదే మహిళలు మాత్రం కొన్నాళ్లు సిక్‌ లీవ్‌లో వెళ్లడం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యాంటీ డిప్రెసెంట్స్‌ను వాడటం చేస్తుంటారని డెన్మార్క్‌కు చెందిన అర్హస్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సుమారు 3000 మంది అభిప్రాయాలు తీసుకోగా.. వీరిలో ఏడు శాతం మంది తాము వర్క్‌ప్లేస్‌లో గొడవల బాధితులమే అని వెల్లడించారు. ఈ బాధితుల్లో 43 శాతం మంది పురుషులు ఉన్నారు.

కాగా.. వర్క్‌ ప్లేస్‌లో గొడవలు పురుషుల ప్రమోషన్‌లు, జీతాలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ముంజెర్గ్‌ ఎరిక్‌సన్‌ వెల్లడించారు. గొడవలతో పురుషులు సిక్‌ లీవ్‌లకు వెళ్లడం మాత్రం జరగదని ఆమె పేర్కొన్నారు. వర్క్‌ప్లేస్‌లో గొడవల మూలంగా కీలకమైన బాధ్యతలు కాకుండా అంతగా ప్రాధాన్యత లేని బాధ్యతలు ఉద్యోగులు పొందుతారని పరిశోధనలో గుర్తించారు.

మరిన్ని వార్తలు