హమ్మయ్య! 'మైక్' భలే బతికిపోయింది!

8 Dec, 2015 19:13 IST|Sakshi
హమ్మయ్య! 'మైక్' భలే బతికిపోయింది!

అనగనగా ఓ వ్యక్తికి ముసలి గాడిద ఉంటుంది. అది బావిలో పడుతుంది. గాడిద ముసలిదవ్వడం, నీళ్లులేని ఆ బావితో ప్రయోజనం లేకపోవడంతో.. ఆ గాడిదతో సహా బావిని పూడ్చేయాలని అతను భావిస్తాడు. కానీ ఆ గాడిద తెలివిగా అతను పోసిన మట్టినంతా దులుపుకొని బావి పూడ్చేసే సరికి పైకి వచ్చేస్తుంది. ఇది మనకు తెలిసిన కథ. ఇలాంటిదే ఐర్లాండ్‌లో జరిగింది. అయితే అక్కడ గాడిద బావిలో కాకుండా వరద నీళ్లలో చిక్కుకుపోయింది. గాడిదే కదా మనకెందుకొచ్చిన ఖర్మ అనుకొని వాళ్లు వదిలేయలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సాహసోపేతంగా బోటులో ప్రయాణించి ఆ గాడిదను కాపాడారు. ఎంతోసేపు వరదనీళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపిన గాడిద ఎట్టకేలకు ఒడ్డుకు చేరడంతో ఆనందంగా ఒండ్ర పెట్టింది. తనను కాపాడిన రెస్క్యూ సిబ్బందిని చూసి ఓ నవ్వు కూడా విసిరింది.

ఈ ఘటన సోమవారం ఐర్లాండ్‌లోని కెర్రీ ప్రాంతంలో జరిగింది. తన గాడిద వరదనీటిలో చిక్కుపోయింది కాపాడమంటూ దాని యాజమాని 'యానిమల్ హెవెన్ యానిమల్ రెస్క్యూ' సంస్థను ఆశ్రయించాడు. వాతావరణ పరిస్థితులు బాగాలేకున్నా.. ఆ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది సాహసోపేతంగా వరదనీటిలో బోటువేసుకొని వెళ్లి మరీ దానిని కాపాడారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ గాడిదకు 'మైక్‌' పేరు పెట్టారు. మైక్‌ ఇప్పుడు యాజమాని కొట్టంలో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నది.

 

 

 

Posted by Animal Heaven Animal Rescue on Sunday, December 6, 2015

 

మరిన్ని వార్తలు