అయ్యో! అవి కొట్టుకోవడం లేదు..

20 Feb, 2020 15:22 IST|Sakshi

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కస్వాన్‌కు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన తన ట్విటర్‌లో చాలాసార్లు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ సంబంధించినవి చాలానే షేర్‌ చేసుకొన్నాడు. తాజాగా కస్వాన్‌ షేర్‌ చేసిన వీడియో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఒక ఫ్లెమింగో పక్షి తన ముక్కుతో మరో ఫ్లెమింగో తలపై రక్తం వచ్చేలా పొడుస్తూనే ఉంది.  ఫ్లెమింగోకు రక్తం దారలా పోతున్నా అది మాత్రం తన మిత్రునిపై ఎటువంటి ప్రతిదాడి చేయకపోవడం ఏంటనే చిన్న డౌటు వచ్చింది. అయితే మనం అనుకుంటున్నట్టుగా వీడియోలో అవి కొట్టుకోవడం లేదట.. వాటి పిల్లలకు ఆహారం అందించేందుకు అలా చేసాయని వీడియో చూస్తే గానీ అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే.. ఫ్లెమింగోలు తన పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు తలపై భాగంలో ఉన్న ఎలిమెంటరీ కెనాల్‌లో క్రాప్‌ మిల్క్‌ రూపంలో నిల్వ చేసి పెడుతుంది. ఫ్లెమింగో తన తిన్న ఆహారంలో జీర్ణం కాకముందే కొంతభాగాన్ని ఎలిమెంటరీ కెనాల్‌లోనే క్రాప్‌ మిల్క్‌ రూపంలో ఉంచుకుంటుంది. ఆ క్రాప్‌ మిల్క్‌లోనే తన పిల్లలకు కావాల్సిన ప్రొటీన్‌,ఫాట్‌ పదార్థాల మిశ్రమం కలిసి ఉంటాయి.

ఫ్లెమింగో తన పిల్లలు సొంతంగా ఆహారాన్ని సంపాదించుకునే వరకు వాటికి ఈ క్రాప్‌ మిల్క్‌ ద్వారానే ఆహారం అందిస్తుంది. అయితే తన పిల్లలకు ఆహారం అందించడానికి తనతో జత కట్టిన పక్షి ముక్కు సహాయంతో తలపై పొడవడం ద్వారా రక్తం రూపంలో క్రాప్‌ మిల్క్‌ను తన పిల్లలకు అందిస్తుంది. అయితే వీడియోనూ నిశితంగా పరిశీలిస్తే రక్తం ద్వారా బయటకు వచ్చే క్రాప్‌ మిల్క్‌ను బుల్లి ఫ్లెమింగో ఆహారాన్ని తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. పర్వీన్‌ కస్వాన్‌ షేర్‌ చేసిన ఈ వీడియానూ దాదాపు 35వేల మందికి పైగా వీకక్షించడం విశేషం.

>
మరిన్ని వార్తలు