'సలార్‌' రెండో ట్రైలర్‌తో ప్రభాస్‌ రెడీ

17 Dec, 2023 06:57 IST|Sakshi

రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్‌​ డైరెక్టర్ ప్రశాంత్​ నీల్ సూపర్‌ కాంబినేషన్‌లో సలార్‌ రానుంది. ఇండియా రేంజ్‌లో అత్యంత భారీ యాక్షన్‌ చిత్రంగా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. రెండు రోజుల క్రితం వరకు ఎలాంటి ప్రచారం లేకుండా ఉన్న సలార్‌ టీమ్‌ ఒక్కసారిగా దూకుడు పెంచేసింది. ప్రభాస్‌ నుంచి నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ వరకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై జోరు పెంచుతున్నారు. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్​తో భారీ బజ్‌ క్రియేట్‌ చేసిన సలార్‌ తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేసింది.

ఇందులో ప్రభాస్‌ యాక్షన్​ ప్యాక్​డ్​ ట్రైలర్‌గా నేడు (డిసెంబర్‌ 17) విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెట్‌ రెడీ ఫర్‌ వైలెంట్ అని హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్‌ పేజీలో క్లూ ఇచ్చింది. కానీ రెండో ట్రైలర్‌ ఉంటుందని ఇంకా అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ లేదు. మొదటి ట్రైలర్‌లో ప్రభాస్‌,పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపిన మేకర్స్‌ రెండో ట్రైలర్‌లో ప్రభాస్‌ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొదటి టికెట్‌ను టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళి కొన్నారు. మరోవైపు యంగ్‌ హీరో నిఖిల్ కూడా 100 టికెట్లు కొన్నట్లు తెలిపాడు. డిసెంబర్‌ 22న హైదరాబాద్‌లోని  శ్రీరాములు థియేటర్‌లో ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని ఆయన చెప్పడం విశేషం.

>
మరిన్ని వార్తలు