వాట్సప్‌ యూజర్లకు శుభవార్త!

13 Dec, 2023 22:29 IST|Sakshi

వాట్సప్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రతి రోజూ వాట్సప్‌కు వచ్చే బండిళ్ల కొద్ది మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైన నెంబర్లను వచ్చే మెసేజ్‌లు గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. అయితే, ఈ సమస్యను పరిష్కరించేలా వాట్సప్‌ సంస్థ ‘పిన్‌’ ఫీచర్‌ను తెచ్చింది. 

ఈ ఫీచర్‌ కేవలం ఆయా గ్రూపుల అడ్మిన‍్లు ఉపయోగించాల్సి ఉంటుంది. టెక్ట్స్‌ మాత్రమే కాకుండా వీడియోలు, పోల్స్‌, ఫోటోలు ఇలా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లను పిన్‌ చేసే సౌకర్యం ఉంటుంది. 

ఇలా పిన్ చేసిన మెసేజ్‌లు ఏడు రోజుల పాటు డిఫాల్ట్‌గా ఉంటాయి. అవసరం అనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. గ్రూప్ సభ్యులకు మెసేజ్‌లు పిన్ చేసి పంపడం అడ్మిన్ల చేతిలోనే ఉంటుంది.

>
మరిన్ని వార్తలు