హవాయిలో కొత్త చట్టం

25 Oct, 2017 22:52 IST|Sakshi

ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా

హవాయి: హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా విధించనున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,200. ప్రజల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు హోనోలులు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను చూసుకోకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. రోడ్లపై ఫోన్లు వాడటంతో ఎదురుగా వస్తున్న వాటిని పట్టించుకోవట్లేదని అధికారులు అంటున్నారు. వీటిని నివారించేందుకే కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు