సిద్ధాంతాలకు సవాల్‌!

5 Nov, 2017 01:20 IST|Sakshi

లండన్‌: ఇప్పటి వరకు ఉన్న అనేక ఖగోళ సిద్ధాంతాలను సవాల్‌ చేస్తున్న ఓ భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని ఇప్పటి వరకు ఉన్న అనేక సిద్ధాంతాలు చెబుతున్నా యి. కానీ ఈ సిద్ధాంతాలన్నీ తప్పని నిరూపిస్తూ చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఎన్జీటీఎస్‌–1బీ అనే ఓ భారీ గ్రహాన్ని బ్రిటన్‌లోని వార్విక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు.

నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం తదితర అంశాల్లో ఇప్పుడున్న సిద్ధాంతాలను ఈ నూతన గ్రహం సవాల్‌ చేస్తోంది. గురుగ్రహం పరిమాణంలో ఈ ఎన్జీటీఎస్‌–1బీ ఉన్నట్లు, ఓ చిన్న నక్షత్రం చుట్టూ ఇది పరిభ్రమిస్తున్నట్లు గుర్తించామని వార్విక్‌ వర్సిటీకి చెందిన పీటర్‌ వీట్లే వివరించారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ చిన్న నక్షత్రానికి, ఎన్జీటీఎస్‌–1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమేనని చెప్పారు. ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం తన పరిభ్రమణాన్ని 2.6 రోజుల్లో పూర్తి చేస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు