తెర మీదకు మరోసారి యూఎఫ్‌ఓలపై చర్చ

14 May, 2020 13:40 IST|Sakshi

వాషింగ్టన్‌: యూఎఫ్‌ఓ (అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌)ల గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో గత నెలలో అమెరికా ర‌క్ష‌ణ సంస్థ  పెంటగాన్‌  గుర్తు తెలియని వస్తువులకు సంబంధించిన మూడు వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ యూఎఫ్‌వోల గురించి చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చలు ఇలా కొనసాగుతుండగానే ది డ్రైవ్‌ అనే మిలిటరీ వెబ్‌సైట్‌ ఫ్రీడం ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద కొన్ని నివేదికలను ప్రచురించింది. వీటిలో ఏడు నివేదికలు 2013, 2014 మధ్య కాలం నాటికి సంబంధించినవి కాగా, ఎనిమిదవ నివేదిక 2019 సంవత్సరానికి సంబంధించింది. వీటిలో అమెరికా నావీ అధికారుల తమకు ఎదురైన అనుభవాలను తెలియజేశారు.

జూన్ 27, 2013 నాటి మొదటి నివేదికలో ఇలా ఉంది ...స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ 11 ఒక విమానాన్ని గుర్తించింది. అది తెలుపు రంగులో ఉండి డ్రోన్ లేదా మిస్సైల్‌ పరిమాణంలో ఉంది’ మార్చి 26, 2014 నాటి నివేదికలో ఇలా ఉంది "చిన్నగా సూట్‌కేస్ పరిమాణంలో, వెండి రంగులో విమానం ఆకారంలో ఉన్న ఓ చిన్న గుర్తు తెలియని విమానాన్ని గుర్తించాం. పైలట్ దానికి 1,000 అడుగుల సమీపం వరకు వెళ్లగలిగాడు.. కానీ దాన్ని గుర్తించలేకపోయాడు అని వెల్లడించింది.

తాజాగా 2019, ఫిబ్రవరి 13న వెల్లడించిన రిపోర్టులో ఓ యుద్ధ విమాన సిబ్బంది 27 వేల అడుగుల ఎత్తున ఓ ఎర్రనివాతావరణ బెలూన్‌ లాంటి ఆకారాన్ని చూసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అమెరికన్‌ నావీ విడుదల చేసిన ఈ నివేదికలు ప్రస్తుతం యూఎఫ్‌ఓలకు సంబంధించిన చర్చను మరోసారి తెరమీదకు తెచ్చాయి. (చదవండి: ఆకాశంలో అంతు చిక్క‌ని వ‌స్తువు! )
 

మరిన్ని వార్తలు