విమానం కుప్పకూలి 9 మంది మృతి

1 Dec, 2019 10:17 IST|Sakshi
ఫైల్ ఫోటో

న్యూయార్క్‌: అమెరికాలోని ఛాంబర్‌ లైన్‌లో దక్షిణ డకోటాకు చెందిన ఓ విమానం శనివారం మధ్యాహ్నం కుప్పకూలిపోంది. ఈ ప్రమాదంలో తూర్పు ఇడాహోకు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో  పైలట్‌తోపాటు, ఇద్దరు చిన్న పిల్లలు కూడా  ఉన్నారని బ్రూల్ కౌంటీ రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడి, తీవ్రమైన గాయాలపాలైన వారిని చికిత్స కోసం సియోక్స్ ఫాల్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. 

పీలాటస్ పీసీ -12 విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరింది. ఈ విమానం ఛాంబర్‌లైన్ మునిసిపల్ విమానాశ్రయం నుంచి ఇడాహోకు బయలుదేరింది. కాగా, ఛాంబర్‌లైన్‌కు దక్షిణంగా ఉన్న కార్న్‌ఫీల్డ్‌లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చూస్తున్నామని రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. తీవ్రమైన వాతావారణ పరిస్థితుల్లో బాధితులను రక్షించడానికి ముందుకు వచ్చిన అందరిని, వైద్యనిపుణులను మౌల్‌ ప్రశంసించారు.  ఈ విమానంలో ఇడాహో చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులతో ప్రయణించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద విమాన ప్రమాదంగా తెలుస్తోంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: చైనాపై మండిపడ్డ ఆస్ట్రేలియా!

ఆ నీళ్లతో కరోనా రాదు...

‘కరోనా’ బీరు ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌!

కరోనా చికిత్స: ఆ మందులు డేంజర్‌

వారి విడుదల.. పాక్‌పై అమెరికా ఆగ్రహం!

సినిమా

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..