మూడు క్షపణుల్ని పరీక్షించిన ఉత్తరకొరియా

27 Aug, 2017 08:48 IST|Sakshi
మూడు క్షపణుల్ని పరీక్షించిన ఉత్తరకొరియా
వాషింగ్టన్‌: ఉత్తరకొరియా శనివారం మూడు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందని అమెరికా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. పసిఫిక్‌ సముద్ర తూర్పు జలాల్లో ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు నిర్వహించిందని, మొదటి రెండు విఫలమవడంతో మూడోది ప్రయోగించినట్లు చెప్పారు.

250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివేనన్నారు. ‘ పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని వైట్‌హౌజ్‌ పేర్కొంది.
మరిన్ని వార్తలు