జాధవ్‌ పిటిషన్‌ పెండింగ్‌లోనే ఉంది..

22 Dec, 2017 05:38 IST|Sakshi

ఇస్లామాబాద్‌: గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్‌ జాధవ్‌కు విధించిన మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని పాకిస్తాన్‌ గురువారం స్పష్టం చేసింది. తల్లి, భార్యను జాధవ్‌ కలసిన తర్వాత మరణశిక్షను అమలు చేయనున్నారని, జాధవ్‌తో వారికిదే చివరి సమావేశమని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. ‘మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదు. ఆయన క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లోనే ఉంది’ అని పాక్‌  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్‌ ఫైసల్‌ చెప్పారు. ‘ఇస్లామిక్‌ సంప్రదాయాలు, మానవతా దృక్పథంతోనే జాధవ్‌ భార్య, తల్లికి పాక్‌ వీసాలిచ్చింది’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు